రూ.కోట్లు వసూలు చేసి జనాలకు కుచ్చుటోపి

Update: 2023-07-26 09:25 GMT

విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. రూ.కోట్లలో చిట్టీలు కట్టించుకుని జనానికి కుచ్చుటోపి పెట్టిన ఘటన కలకలం రేపింది. వడ్డీ వ్యాపారి అప్పల నాయుడు ఇంటిని బాధితులు ముట్టడించారు. అప్పలనాయుడు ఐపీ పెట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి గుణదల భానునగర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు రంగంలోకి దిగారు. అయితే నిందితుడు రూ.3 కోట్ల వరకు చిట్టీలు కట్టించుకుని ఐపీ పెట్టడంతో బాధితులు రోడ్డెక్కారు. మొత్తం 200 మంది వరకు బాధితులు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు చిట్టీలు కట్టారు. రెండు రోజులు క్రితం 170 మందికి ఐపీ నోటీసులు అందాయి.

Tags:    

Similar News