చికెన్ ధర మాంసం ప్రియులకు షాక్ ఇస్తోంది. ఒక్కసారిగా కోడి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. మొన్నటి వరకు రూ.250 పలికిన కిలో కోడి మాంసం ధర ఇఫ్పుడు 310 కి చేరింది. వీకెండ్లో ధర పెరగడంతో సామాన్యులు సండే మెనూ మార్చే పనిలో మునిగిపోయారు.
ఎండలు ముదురడంతో కోళ్లు చనిపోవడం, సరఫరా మార్కెట్‌కు తగ్గట్లుగా లేకపోవడంతో పాటు దాణా ఖర్చులు అధికమవ్వడంతో కోడి ధర కొండెక్కి కూర్చుకుంది. గత రెండు రోజులుగా మృగశిర కార్తె హడావిడి ఉండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.310 పలుకుతోంది. స్కిన్‌తో ఉన్న చెకెన్ను రూ.280 వరకు విక్రయిస్తున్నారు. ఇక లైవ్ బర్డ్ కిలో రూ.188 వరకు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.60లకు పైగా ధర పెరిగింది. పెరిగిన ధర వచ్చే వారం వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.