Nara Lokesh: హైకోర్ట్లో లోకేశ్ పిటిషన్ డిస్పోజ్.. సీఐడీకి ఫుల్ పర్మిషన్

Byline :  Bharath
Update: 2023-09-29 07:45 GMT

టీడీపీ నేత, నారా లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించిన కేసులో.. సీఐడీ లోకేశ్ పేరును ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన మెమోలో లోకేశ్ ను ఏ14గా చేర్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి లోకేశ్ కు సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీలో ఉండగా.. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ ఢిల్లీ బయల్దేరింది. ఆ తర్వాత విచారణ కోసం కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా దీనిపై లోకేశ్ ఏపీ హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్ట్ డిస్పోజ్ చేసింది. శుక్రవారం లోకేశ్ తరుపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరుపు న్యాయవాది ఏజీ శ్రీరామ్.. తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు ధర్మాసనం లోకేశ్ పిటిషన్ కొట్టేసి.. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని లోకేశ్ కు సూచించింది. దీంతో హైకోర్ట్ ఆదేశాల మేరకు సీఐడీ ఢిల్లీకి బయలుదేరింది. ఒకవేళ లోకేశ్ విచారణకు సహరకరించకపోతే.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే సీఐడీ లోకేశ్ ను అదుపులోకి తీసుకోవల్సి ఉంటుంది.




Tags:    

Similar News