చంద్రబాబు బతుకు మోసం, అబద్ధం, కుట్ర, వెన్నుపోటులతో నిండిపోయింది: సీఎం జగన్

Update: 2023-06-12 10:51 GMT

చంద్రబాబు పెత్తందారి మనస్తత్వం కారణంగా.. అన్ని రంగాల్లో పేరలపై వ్యతిరేకత చూపించాడని సీఎం జగన్ ఆరోపించాడు. పేద పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ట్యాబులు పంపిణీ చేస్తుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. పల్నాడులోని క్రోసూర్ లో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబు తీరును ఏకిపారేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబుకు ఏనాడు లేదని.. 14 సంవత్సరాల సీఎంగా ఉండి ఏ ఒక్క మంచి పని చేశాడని జగన్ ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలకుండా.. అందరికీ హామీలిచ్చిన చంద్రబాబు, పదవి రాగానే అవన్నీ మర్చిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని గుర్తించాలని ప్రజలకు కోరారు సీఎం జగన్. అవినీతి వివక్షకు తావులేకుండా లబ్ధి దారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన పథకం తమదని జగన్ గుర్తుచేశారు. మోసం, అబద్ధం, కుట్ర, వెన్నుపోటులతో చంద్రబాబు బతుకు మారిపోయిందని జగన్ మండిపడ్డారు.


Tags:    

Similar News