అర్చకులకు సీఎం దసరా కానుక.. ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ..

Byline :  Bharath
Update: 2023-10-19 14:07 GMT

దసరా పండుగ వేళ.. అర్చకులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎలక్షన్ హామీలను నెరవేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు ఈ నిర్ణయంతో లబ్ధిచేకూరనుంది. అర్చకులకు కనీస వేతనం కింద రూ. 15,625 అమలు చేయాలని ఏపీ దేవాదాయ కమిషనర్ ను ఆదేశించారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్.. గత పాలనకు తమ పాలనకు తేడా చూడండని ప్రజలను కోరారు. ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 52 నెలల్లో నెరవేర్చామని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న చేదోడు అందిస్తామని హామీ ఇచ్చారు.




Tags:    

Similar News