పక్కవారు సీఎం అవ్వాలనే పవన్ పార్టీ పెట్టాడు.. సీఎం జగన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని.. ఆయన నివాసంలో పక్క రాష్ట్రంలో ఉంటుందని ఎద్దేవా చేశారు. పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టినవాడు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జీవితం ఉంది అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని, దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు అన్నారు. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను ఇంతకుముందెన్నడూ చూసి ఉండమన్నారు. ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారు.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడు ఈ మ్యారేజ్ స్టార్ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా? అని సీఎం జగన్ అడిగారు.