అద్దంకిలో సీఎం జగన్ సిద్ధం సభ..మ్యానిఫెస్టో రిలీజ్ చేసే ఛాన్స్?
ఇవాళ సీఎం జగన్ అద్దంకిలో పర్యటించనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుడడంతో సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు జగన్. అద్దంకిలో ఇది చివరి సభ కావడంతో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మేదరమెట్ల వద్ద కోల్కత్తా, చెన్నై నేషనల్ హైవే పై సుమారు 200 ఎకరాల్లో సభను నిర్వహించనున్నారు. దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభలో ఐదేండ్ల సంక్షమం, చేసిన అభివృద్ధిని ముఖ్యమంత్రి వివరించనున్నారు. విపక్షాల పొత్తు తర్వాత జగన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటితో వైసీపీ సిద్ధం సభలు ముగియనుండడంతో సీఎం జగన్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చివరి సభ కావడంతో సీఎం జగన్ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. సిద్ధం బహిరంగ సభ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 4,200 మంది పోలీసులు, అధికారులు, సిబ్బందితో పహారా కాయనున్నారు.