రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీమంత్రికి బెయిల్

By :  Krishna
Update: 2023-10-03 16:57 GMT

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన టీడీపీనేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు నగరం పాలెం పోలీసు స్టేషన్లో బండారు సత్యనారాయణపై 153 ఏ, 354ఏ, 504, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, ఉద్దేశపూర్వకంగా కించపరచడం, అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవాళ మధ్యాహ్నం జీజీహెచ్ లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే బీపీ ఎక్కువగా ఉండడంతో.. కంట్రోల్ అయ్యేవరకు ఆస్పత్రిలోనే ఉంచారు. ఆ తర్వాత మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల తనకు గౌరవం ఉందని.. రాజ్యాంగం ప్రకారమే న్యాయస్థానంలో తనకు న్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు కూడా త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News