Chandra babu Arrest : బాబు అరెస్ట్ వైసీపీ అరాచకాలకు పరాకాష్ట - సీపీఐ నారాయణ
Byline : Kiran
Update: 2023-09-09 06:26 GMT
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీపీఐ నాయకులు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ అరాచక పాలనకు ఇది పరాకాష్ట అని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని ఎలాంటి ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు ఇది అద్దం పడుతోందని నారాయణ అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ హయాంలో రెండు రకాల పాలన సాగుతోందని నారాయణ విమర్శించారు. అందులో ఒకటి రివర్స్ టెండరింగ్, రెండోది రివేంజ్ పాలన అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి పరిపాలన కొనసాగిస్తుండటం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.