జగన్ కోర్టుకు రావాల్సిందే.. దళిత సంఘాల ఆందోళన

Byline :  Veerendra Prasad
Update: 2023-08-29 07:14 GMT

కోడికత్తి కేసులో ఏపీ సీఎం జగన్ కోర్టుకు రావాలంటూ విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక నిరసన చేపట్టింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. కాగా.. నేటి నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ జరగనుంది. ఇదివరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ విశాఖకు బదిలీ చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కోడికత్తితో దాడి చేయడం జరిగింది. జగన్‌పై జరిగిన దాడిలో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ ప్రారంభమైంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉండగా 2018లో ఆయనపై కోడికత్తితో దాడి చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఈ దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేడంతో జగన్‌కు గాయం కాగా.. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నెల క్రితం వరకూ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారిస్తున్నారు. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ఎ.సత్యానంద్‌ ఈ కేసును పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News