తిరుమల రింగ్ రోడ్డు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By :  Lenin
Update: 2023-08-15 16:36 GMT

తిరుమలలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. భక్తులు గమనించి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే సదరు వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దానిపై స్పష్టత రాలేదు

కరీంనగర్‌కు చెందిన తులసిరామ్‌ తిరుమల రింగ్ రోడ్డు దగ్గర మంగళవారం ఉదయం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన భక్తులు 108కి సమాచారమిచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం అశ్విని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై తులసిరామ్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు పోలీసులు చెప్పారు. మద్యానికి బానిసై ఇలా చేసుకున్నానని ఓసారి చెబుతుండగా.. కుటుంబ కలహాలు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు మరోసారి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News