నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

By :  Vinitha
Update: 2024-03-06 02:29 GMT

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనకగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. నిద్ర మత్తులోనే ప్రమాదంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News