ఆహారంలో తేడా రావడంతో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో మంగళవారం రాత్రి ఫుడ్ పాయిజినింగ్ జరిగింది. గుడ్డు, టమాటా రైస్, పెరుగన్నం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. భోజనం పాడైపోవడం వల్లే ఇలా జరిగిందని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. హాస్టల్ కిచెన్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు.