సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల

Update: 2024-01-31 15:41 GMT

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల్‌లోకి చేరారు. రావెలకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్ కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల తెలిపారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఐఆర్‌ఎస్‌గా పనిచేశారు. రావెల్ తొలుత టీడీపీలో చేరి. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లో జనసేనలో చేరిన రావెల.. ఆ మరుసటి ఏడాదే రాజీనామా చేశారు. మళ్లీ బీజేపీలో చేరారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News