Durga Temple : దుర్గమ్మ భక్తులకు శుభవార్త..పాలకమండలి కీలక నిర్ణయం

Update: 2024-01-31 01:19 GMT

విజయవాడ దుర్గమ్మ భక్తులకు పాలకమండలి గుడ్‌న్యూస్ చెప్పింది. అమ్మవారి దర్శనానికి వచ్చేవారి కోసం రైల్వేస్టేషన్స్, బస్టాండ్‌లల్లో కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆ కౌంటర్ల ద్వారా రోజూ అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే కొండపైన పూజా మండపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 18వ తేది నుంచి మల్లేశ్వరస్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని వెెల్లడించింది.

శివాలయానికి సంబంధించి అంతరాలయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. జనవరి నెలలో ఒక్క 26వ తేదీనే లక్షకు పైగా భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నివేదన సమయంలో వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నామని, ఆ సమయంలో దర్శన్నాన్ని వారు వాయిదా వేసుకోవాలని కోరింది. భక్తుల సౌకర్యార్థం త్వరలో గిరి ప్రదక్షిణ మార్గంలో బస్సులను నడపనున్నట్లు తెలిపింది.

ఘాట్ రోడ్డును మరింత విస్తరించి, మరమ్మతులు చేసేందుకు నిర్ణయించామని పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పలు పనులను పూర్తి చేయనున్నామన్నారు. కొండచరియల గురించి దేవాదాయశాఖ మంత్రితో చర్చిస్తామన్నారు. దుర్గగుడి అభివృద్ధిపై రాజీపడకుండా అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆలయ పనులను వేగవంతంగా పూర్తిచేస్తామన్నారు.


Tags:    

Similar News