CM Jagan : వారికి గుడ్‌న్యూస్.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Byline :  Shabarish
Update: 2024-02-28 10:37 GMT

మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ తమ పథకాలను అమలు చేస్తున్న విధానాన్ని చెబుతూ, నిధులను విడుదల చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఏపీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేసింది.

రైతుల అకౌంట్లల్లోకి రైతు భరోసా నిధుల కింద రూ.1,078 కోట్లను జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. గత 57 నెలల్లో రైతు భరోసా రూపంలో రూ.34,288 కోట్లను అందించినట్లు తెలిపారు. ఈ స్కీమ్ కింద 53.58 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని, రైతుల సంక్షేమం కోపం తమ ప్రభుత్వం అహర్నిశలు కృ‌షి చేస్తోందని అన్నారు.

ఏపీలో 70 శాతం మంది రైతులు హెక్టారు లోపు భూమి ఉన్నవారని, అర హెక్టారులోపు భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారన్నారు. అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్లుగా సీఎం జగన్ తెలిపారు. 10.79 లక్షల రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద నేడు రూ.215.98 కోట్లను విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.

Tags:    

Similar News