Keerthi Chekuri : గుంటూరు మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష
కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. మున్సిపల్ కమిషనర్ కోర్డు ధిక్కరణకు పాల్పడిందంటూ కోర్టు అభిప్రాయపడింది. ఎంతకు ఏం జరిగిందంటే.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను గతంలో విచారించిన కోర్టు.. పిటిషనర్ లకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కీర్తి పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మున్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా మున్సిపల్ కమిషనర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని మండిపడింది. ఈ క్రమంలోనే కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆమెను ఆదేశించింది.