Andhra Pradesh : తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య.
Byline : Veerendra Prasad
Update: 2023-09-08 07:38 GMT
ఏపీలోని కర్నూలు జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ.. బాత్‌రూమ్‌లో తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. గన్ శబ్దంతో సిబ్బంది వెళ్లి చూసేసరికి హెడ్‌కానిస్టేబుల్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.