చంద్రబాబు పిటిషన్పై సుప్రీంలో ఆగిపోయిన విచారణ

Byline :  Krishna
Update: 2024-01-17 10:33 GMT

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ జరిపిన బెంచ్ ముందుకే ఈ పిటిషన్ వెళ్లింది. ఈ పిటిషన్ను జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. అయితే జస్టిస్ బేలా ఎం. త్రివేది మరో కేసు విచారణలో బిజీగా ఉండడంతో ఇవాళ్టి విచారణ ఆగిపోయింది. దీంతో మరో రోజు పిటిషన్పై విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంలో సవాల్ చేశారు.

స్కిల్‌ కేసుకు సంబంధించి 17-ఎ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఫైబర్‌ నెట్ కేసు పిటిషన్‌ విచారణ వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. మంగళవారం సెక్షన్‌ 17-ఏపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు రిఫర్‌ చేసింది. కానీ స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం గమనార్హం. కాగా సీఎంగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది.  

Tags:    

Similar News