వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. 15 రోజులకు పైగా చంచల్ గూడ జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డికి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయ వాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు. మరోవైపు మరోవైపు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని గత విచారణలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.