హెరిటేజ్ షేర్ విలవిల.. చంద్రబాబు అరెస్ట్‌తో భారీ పతనం..

Update: 2023-09-13 02:51 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం హెరిటేజ్‌ కంపెనీపై ప్రభావం చూపుతోంది. బాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుటుంబ సారథ్యంలోని కంపెనీ షేరు ధర భారీగా పతనం అవుతోంది. శనివారం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ధర 19 శాతం పడిపోయింది. మంగళవారం రూ.32 (12.5 శాతం) క్షీణించి రూ.221కి చేరింది. బాబు అరెస్టుకు ముందు షేరు విలువ రూ. 272 ఉండేది. 24 లక్షల షేర్లు ట్రేడ్ అవడంతో వాటాదారులు భారీ నష్టాన్ని చవిచూశారు. కంపెనీ మార్కెట్ విలువ రూ.450 కోట్లు తగ్గి రూ.2,073 కోట్లకు చేరుకుంది. కంపెనీలో బాబు కుటుంబానికి దాదాపు 42 శాతం ఉంది. బాబు ఇప్పట్లో జైలు నుంచి బయటికి రాకపోతే షేరు విలువ మరింత పడిపోయే అవకాశం ఉంది. కాగా, చంద్రబాబుపై నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో హెరిటేజ్ కంపెనీ హస్తం కూడా ఉందని ఏపీ సీఐడీ చెబుతోంది. మార్చిన అలైన్‌మెంట్‌ పక్కనను భూములను కంపెనీ కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags:    

Similar News