Nara Lokesh : స్కిల్ కేసు.. లోకేశ్ పిటిషన్ డిస్పోజ్

Byline :  Bharath
Update: 2023-10-12 09:26 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్డ్ డిస్పోజ్ చేసింది.  (Nara Lokesh)ఈ కేసులో లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని.. దానివల్ల అతన్ని అరెస్ట్ చేయబోమని సీఐడీ తరుపు లాయర్లు హైకోర్ట్ కు తెలిపారు. దీంతో హైకోర్టులో లోకేశ్ కు ఊరట లభించింది. ఒకవేళ కేసులో లోకేశ్ పేరును చేర్చితే తప్పక 41ఏ నిబంధనలను అనుసరిస్తామని తెలిపింది. దీంతో న్యాయస్థానం లోకేశ్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. అటు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.

లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈనెల 4న విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 12 వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్ట్ సీఐడీని అదేశించింది. ఈ క్రమంలో కోర్ట్ ఇవాళ విచారణ చేపట్టింది. సీఐడీ చంద్రబాబుపై వేసిన రిమాండ్ రిపోర్ట్ లో.. ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు చూపారని లోకేశ్ తరుపు లాయర్ హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో పిటిషనర్ ను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్ట్ కు తెలిపారు. దీనిపై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. లోకేశ్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.    


Tags:    

Similar News