టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు : భూమన కరుణాకర్ రెడ్డి

Update: 2023-08-16 08:11 GMT

టీటీడీ ఉద్యోగలందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూమన హామీ ఇచ్చారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "సెప్టెంబరు18వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తాం.అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి పట్టాలు అందిస్తాం. దివంగత సీఎం డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అందరికీ పట్టాలు ఇస్తాం." అని భూమన వెల్లడించారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పట్టుదల, కృషి తోనే ఉద్యోగులకు ఇంటిస్థలాలు వస్తున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటి స్థలాలు అందిచనున్నట్లు తెలిపారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండడంతో మంచి ధర పలుకుతోందన్నారు. ఛైర్మన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18 లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, కచ్చారోడ్లు వేసి తుడా అనుమతి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News