కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం చివరి వరకు నిలబడతా : Sharmila

Byline :  Krishna
Update: 2024-01-20 14:55 GMT

కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం చివరి వరకు నిలబడతానని వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం ఏపీ పీసీసీ చీఫ్గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో తన తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్కు కాంగ్రెస్ సహా ఆ పార్టీ సిద్ధాంతాలంటే ఎంతో ఇష్టమని.. వాటికోసం ఎంత దూరమైన వెళ్లేవారని అన్నారు. ప్రస్తుతం దేశంలో సెక్యులరిజానికి అర్ధమే లేకుండా పోయిందని విమర్శించారు.

ఇలాంటి సమయంలో దేశానికి మంచి జరగాలంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలని షర్మిల అన్నారు. వైఎస్సార్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఆదివారం ఉదయం 11గంటలకు విజయవాడలో షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకరావడమే తన ప్రధాన కర్తవ్యమని ఇప్పటికే ఆమె ప్రకటించారు. షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ లో చేరికలు పెరిగే అవకాశం ఉంది. వైసీపీ, టీడీపీ అసంతృప్త నేతలు హస్తం కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News