వైసీపీ సినిమా అయిపోయింది.. ఇంకో 100 రోజులు ఆగండి: చంద్రబాబు
By : Bharath
Update: 2023-12-28 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సినిమా అయిపోయిందని, ఆ పార్టీకి ఇంకా 100 రోజులే మిగిలి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కుప్ప నియోజకవర్గంలోని గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ‘కుప్పం నాకు సొంత కుటుంబం లాంటిది. ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని’ అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే బాధ్యత తనదని భరోసానిచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ వందరోజులు యువత టీడీపీ కోసం పనిచేస్తా.. రానున్న ఐదేళ్లలో ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని భరోసానిచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత టీడీపీ- జనసేన పార్టీలదని చెప్పారు.