Diarrhea cases : గుంటూరులో డయేరియా కలకలం..పెరుగుతున్న కేసులు

Update: 2024-02-11 06:35 GMT

గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరగడంతో మున్సిపాల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాటర్ శాంపిల్స్ సేకరించారు. జీజీహెచ్‌లో 35 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిని నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని పరామర్శించారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని, టీడీపీ హయాంలో డయోరియా వ్యాధి సోకి గుంటూరులో 24 మంది మరణించారని మంత్రి రజిని విమర్శించారు.

శారదా కాలనీలో మున్సిపల్‌ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందగా, మరో 10మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులను కమిషనర్‌ చేకూరి కీర్తి, జనసేన, తెలుగు దేశం పార్టీ నాయకులు పరామర్శించారు. మూడు రోజుల క్రితం డయేరియాతో సంగడిగుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని నగర వాసులు ఆరోపిస్తున్నారు. పద్మ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు జీజీహెచ్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు. తాగునీరు సరిగా ఇవ్వలేని కమిషనర్‌ ఎందుకని ప్రశ్నించారు.

Tags:    

Similar News