Chandrababu Naidu : జగన్ ఒక రాజకీయ వ్యాపారి..టీడీపీ అధినేత చంద్రబాబు

Update: 2024-01-27 08:31 GMT

జగన్ పాలనలో ఏపీ అస్తవ్యస్తం అయ్యిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా కోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని చెప్పారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందని..ముఖ్యమంత్రి గద్దె దించేందుకు ప్రజలు, ఉద్యోగులంతా సిద్దంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైయ్యారన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందని..ఎక్కడ చూసిన దొంగలే ఉన్నారని తెలిపారు. జగన్ రాయలసీమ ద్రోహీ అని అసలు ఏపీకి జగన్ అవసరమా అని ప్రశ్నించారు. జగన్ సైకో పాలనతో ప్రజలంతా నష్టపోయారని ఆరోపించారు. ఇక కురుక్ష్రేత్రం మొదైలందని..యుద్ధంలో టీడీపీ, జనసేనదే విజయం అంటు చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన జగన్ పట్టించుకొలేదని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కు కూడా వైసీపీ ప్రభుత్వం పునాది వేయలేదని..జగన్ ఒక రాజకీయ వ్యాపారి అని విమర్శించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.  

Tags:    

Similar News