రాష్ట్రానికి నిధులు కేటాయించండి ప్రధానికి జగన్ వినతి : CM Jagan

Update: 2024-02-09 07:41 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలను ప్రధాని దృష్ఠికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని సీఎం కోరారు. ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.

జాతీయ ఆహార భద్రతాచట్టం ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ కింద ఏపీ కన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా.. ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు.నంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశం ఉంది. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News