Varahi Yatra: నాల్గో విడతకు సర్వం సిద్ధం.. రేపట్నుంచి పవన్ వారాహి యాత్ర..

By :  Kiran
Update: 2023-09-30 02:58 GMT

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుంచి ప్రారంభం కానుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది. నాల్గో దశ యాత్ర 5 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా పవన్ 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్టోబర్ 3న పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3న నిర్వహించే జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఇక 4న పెడన, 5న కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగనుంది. పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర అవనిగడ్డ నుంచి ప్రారంభించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వైసీపీ సర్కారును, టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి లబ్ది పొందాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. గతంలో హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదంతో జనంలోకి వెళ్లిన ఆయన.. ఈసారి మనకొద్దీ పాలన అని కొత్త నినాదాన్ని వినిపించనున్నారు.

Tags:    

Similar News