Pawan Kalyan : విశాఖ ఫిషింగ్ హార్బర్ బాధితులకు పవన్ సాయం..
విశాఖ ఫిష్షింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన.. అక్కడి మత్స్యకారులు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. తమ జీవనాధారమైన బోట్లు తమ కళ్ళ ముందే తగలడబడిపోవడంతొ అక్కడి మత్స్యకారులు తమ బతుకుదెరువుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్ లో 60కి పైగా బొట్లు దగ్ధం అయ్యినట్లు సమాచారం. ఆ నష్టపోయిన కుటుంబాలు అన్ని ఏం చేయాలో తెలియని నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. తీవ్ర శోకంలో ఉన్న వారికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఆ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తాను సహాయం చేస్తానంటూ మాటిచ్చారు. అదికూడా రెండు మూడు రోజులోనే చేస్తానంటూ వెల్లడించారు. పవన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. "విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్ల దగ్ధం అయ్యినట్లు సమాచారం. ఆ ప్రమాదంలో బోట్లు పోగుట్టుకున్న ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను. ఆ కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది" అంటూ పేర్కొన్నారు.
కాగా, ఫిష్షింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదం పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఓ యూట్యూబర్ వల్ల ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని విషయాలు విచారణ అనంతరం తెలుపుతామని పోలీసులు చెప్పారు.