జైలులో చంద్రబాబు..నారా లోకేష్తో పవన్ ఏమన్నారంటే..?

Byline :  Krishna
Update: 2023-09-11 02:36 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేష్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలని ఇబ్బందులకు గురిచేయడం జగన్ కు అలవాటుగా మారిందని పవన్ విమర్శించారు. జగన్ సీఎం జగన్ అరాచకాలపై కలిసి పోరాడుదామని చెప్పారు. చంద్రబాబుకు అరెస్ట్కు నిరసనగా టీడీపీ ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు జనసేన మద్ధతు పలికింది.

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జైలులో బాబును స్నేహ బ్లాక్లో ఉంచిన అధికారులు.. ఆయనకు ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు.

మరోవైపు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

అదేవిధంగా హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. అటు సీఐడీ సైతం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును 10రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం బాబు బెయిల్పై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News