నాదేండ్లను వెంటనే విడుదల చేయాలి.. లేకపోతే విశాఖ వచ్చి.. : పవన్ కళ్యాణ్

By :  Krishna
Update: 2023-12-11 09:47 GMT

విశాఖపట్టణంలో జనసేన నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సహా అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలోని టైకూన్‌ జంక్షన్‌ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసేన నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్న పవన్.. ఆయన అరెస్టు అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయకపోతే విశాఖ వచ్చి పోరాడుతానని హెచ్చరించారు.

విశాఖ ఎంపీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందనే రోడ్డు మూసేశారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కాగా విశాఖలోని టైకూన్‌ జంక్షన్ నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దీనిపై జనసేన నేతలు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన నాదెండ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్‌ గేటు వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.


Tags:    

Similar News