తెలంగాణలో ఓటమి.. గర్వంగా ఉంది.. జనసేన

By :  Lenin
Update: 2023-12-04 14:54 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీలో రచ్చ జరుగుతోంది. జనసేన కాదు ‘సున్నాసేన’ అని వైసీపీ వెక్కిరిస్తోంది. దీనికి జనసేన కూడా ఘాటుగా బదులిస్తోంది. ధైర్యంగా పోటీ చేశామని, వైసీకి ఆ ధైర్యం లేక తెలంగాణ నుంచి జెండ మడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేసింది.

జనసేన ఓటమిపై వైసీపీ ట్వటర్లో ఓ పోస్ట్ వేసింది. ‘‘తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన 8 మంది తరుఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా.. టీడీపీ మద్దతుదారులు ఓట్లేయకపోవడంతో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.’’ అని రాసుకొచ్చింది. 

దీనిపై జనసేన డిజిటల్ టీమ్ జనసేన శతఘ్ని తీవ్రంగా స్పందించిది. ‘‘గెలిచినా ఓడినా మేం తెలంగాణ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ పెట్టాం అని గర్వంగా చెప్పుకోగలం.. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ ఒకటి కాదు.. తెలుగు ప్రజల బాగుకోసం ఓటమిని భరించి పని చేస్తాం.. అయితే తమ అధినేత జగన్ తెలంగాణాలో పార్టీ ఎందుకు ఎత్తేసినట్టు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించిన తెలంగాణ ప్రజలపై మీకు బాధ్యత లేదా? "రాజన్నరాజ్యం"లో బ్రతికే భాగ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఎందుకు? ఎందుకంటే తెలంగాణని దోచుకుతిన్న జగన్ కి తెలంగాణలో పోటీ చేసే నైతిక హక్కు, ధైర్యం లేవు కనుక.. మానుకోట ఉదంతం పీడకలలా వెంటాడుతుంది కనుక..మరి ఇన్ని మచ్చలు కింద పెట్టుకుని పార్టీ జెండా మడిచి వెనుక పెట్టుకుని పారిపోయిన మీకు తెలంగాణ ఫలితాలపై మాట్లాడే ముందు కొంచెం సిగ్గు అనిపించి ఉండాలి’’ అని ఎదురుదాడికి దిగింది. 

Tags:    

Similar News