‘‘ఈ దేశంలోని చట్టాలను శక్తిమంతంగా అమలు చేస్తే జగన్ ముఖ్యమంత్రి కాలేరు. ఒకపక్క దేశంలో ప్రతిష్టాత్మకమైన జీ20 సమావేశాలు జరుగుతుంటే జగన్ తన నీచ రాజకీయాలతో వాటిని పాడు చేశారు. చంద్రబాబుకు ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ మద్దతిస్తాను. అన్యాయాలపై పోరాడతాను’’ అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చంద్రబాబు అరెస్ట్‌పై శనివారం నిరసన తెలిపిన జనసేనాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
‘‘బెయిల్ మీద వచ్చినోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదీ మన దౌర్భాగ్యం. అతడు రెండేళ్లు జైల్లో ఉండి బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఏం చేశాడో ఏమోగాని చేశాడో ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయి. అధికారం ఉందని ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారు. అసలు సమస్యను సృష్టించి వైపీసీనే. ఇపుడు ఎవరూ మాట్లాడొద్దని నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు’’ అని మండిపడ్డారు. జగన్ పోలీస్ వ్యవస్థను పూర్తగా భ్రష్టుపట్టించాడని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ హంతుకులను రోడ్లమదికి వదిలేశారని అన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోది. మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోసం పోరాడతాను’’ అని ప్రకటించారు. జగన్‌ను తెలంగాణ ప్రజలు రాళ్లతో తరిమికొట్టారని, ఏపీలో కూడా అదే గతి పడుతుందని అన్నారు. జగన్ మానసిక రోగి అని, తను జైలుకు వెళ్లినందుకు, అందరినీ జైలుకు పంపిస్తున్నాడని ధ్వజమెత్తారు.