తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్...జనసేన లీగల్ సెల్ వార్నింగ్

Update: 2023-07-07 14:16 GMT

ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్నారని ఆ వార్తలు సారాంశం. పవన్‌తో మనస్ఫర్థలు కారణంగా అన్నా లెజినోవా పిల్లలతో కలిసి రష్యా వెళ్లిపోయారని..ప్రస్తుతం అక్కడే ఉంటున్నారని ప్రచారం జరిగింది. ఆ కథనాలపై జనసేన క్లారిటీ ఇచ్చింది. భార్యతో కలిసి పవన్ కల్యాణ్ పూజా కార్యాక్రమంలో పాల్గొన్న ఫోటోని ట్వీట్ చేసింది. అయినా ఇంకా ఆ ప్రచారాలకు ఆడ్డుకట్టపడలేదు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో జనసేన లీగల్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్‌పై తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక హెచ్చరిక జారీ చేస్తూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఆయన భార్య విడిపోతున్నారని కావాలనే కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసున్నారని జనసేన మండిపడింది. కొంతమంది కుట్ర దారులు కలిసి ఇదంతా చేస్తున్నట్లు జనసేన దృష్టికి వచ్చిందని తెలిపింది. ఫేక్ పోస్టులు పెట్టే కొన్ని ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ దంపతులకు క్షమాపణలు చెప్పాలని.. తాము తప్పుడు ప్రచారం చేయబోయినట్టు ఒప్పుకోవాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది. ఒకవేళ అలా క్షమాపణ చెప్పకపోతే వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. సెక్షన్ section 153,499,500 and 120-B read with 34 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తామని జనసేన లీగల్ సెల్ హెచ్చరించింది.

JanaSenaParty has decided to take strict legal action against to false news


Tags:    

Similar News