చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కల్యాణ్

Byline :  Kiran
Update: 2023-09-09 08:17 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్థరాత్రి అరెస్టు చేశారని పవన్ మండిపడ్డారు. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది పవన్ విమర్శించారు.

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులైతే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. తప్పు చేసిన వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లవచ్చని, అదే టీడీపీ అధినేతను అరెస్ట్ చేస్తే కనీసం ఆ పార్టీ కార్యకర్తలు ఇండ్ల నుంచి బయటకు రావద్దా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News