స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. బాబును కస్టడీకీ ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోకేష్ను ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని సీఐడీ లోకేష్కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. విచారణకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.