Chandrababu Custody : చంద్రబాబు కస్టడీపై తీర్పు మధ్యాహ్నానికి వాయిదా

By :  Krishna
Update: 2023-09-22 06:14 GMT

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నెల 24వరకు కోర్టు ఆయనకు రిమాండ్ పొడిగించింది. ఇక చంద్రబాబును ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది. దీనిపై గత రెండు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇవాళ ఉదయం 10.30కు తీర్పు రావాల్సి ఉండగా.. కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై మధ్యాహ్నం 1.30గంటలకు తీర్పు రానుందని ఆయన లాయర్లు ఏసీబీ కోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కస్టడీ తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతకుముందు సీఐడీ కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని జడ్జి తెలుసుకున్నారు. ‘‘మిమ్మల్ని కస్టడికి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. కానీ మీ లాయర్లు కస్టడీ ఒద్దని వాదించారు’’ అని జడ్జి బాబుతో అన్నారు. అయితే తనను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని.. చేయని తప్పును చేశానని చెబుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు దీన్ని శిక్షగా భావించొద్దని.. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే అని.. నేర నిరూపణ కాలేదని జడ్జి అన్నారు.


Tags:    

Similar News