KA Paul : నేను చెప్పింది వినకపోతే.. జగన్ కూడా మాజీ సీఎం అవుతాడు: కేఏ పాల్

Byline :  Bharath
Update: 2024-01-09 14:11 GMT

తాను చెప్పింది వినకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా మాజీ సీఎం అవుతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం (జనవరి 9) జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ కు వచ్చిన పాల్.. వైసీపీపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను కలిసేందుకు రాగా.. కార్యాలయంలోని వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. కొంతసేపు అక్కడ వెయిట్ చేసిన పాల్.. అక్కడినుంచి వెనుదిరిగాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని మండిపడ్డారు.

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ప్రజా శాంతి పార్టి కలిసి పనిచేయాలని, ఈ విషయాన్ని జగన్ తో చెప్తాలని వెళ్తే లోనికి అనుమతించలేదని అన్నారు. ఇవాళ, రేపు విజయవాడలోనే వెయిట్ చేస్తానని, కలిసేందుకు అనుమతివ్వకపోతే.. శపిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్.. 175 స్థానాల్లో గెలుస్తారో, 75 సీట్లలో గెలుస్తారో తనకు తెలియదన్నారు. ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గారు అనుమతిచ్చారని, సీఎం జగన్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.




Tags:    

Similar News