పోలింగ్ రోజునే రిజల్ట్స్ ప్రకటించండి.. ఈసీకి కేఏ పాల్ అభ్యర్థన..

Byline :  Kiran
Update: 2024-01-09 08:16 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఈసీ రాజీవ్ కుమార్ బృందాన్ని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరారు. పోలింగ్‌ రోజునే రిజల్ట్స్ ప్రకటించాలని సీఈసీని అభ్యర్థించినట్లు కేఏ పాల్ చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాపులందరూ బయటకు రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓ రిక్వెస్ట్ చేశారు. వంగవీటి రంగాను చంపిన పార్టీతో కలవద్దని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, విష ప్రయోగం జరిగినా దేవుడి దయతో వైద్యుల సాయంతో బయటపడ్డానని కేఏ పాల్ అన్నారు. తనపై జరిగిన విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు.

Tags:    

Similar News