కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు..

Update: 2023-05-31 12:27 GMT

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‎గా పోటీ చేస్తానని ప్రకటించారు. తన స్థానంలో ఏ పిట్టల దొరకి సీటిచ్చినా ఇబ్బందని లేదని తెలిపారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటే గెలుస్తానని అశాభావం వ్యక్తం చేశారు. తన మాటలను ఎవరూ ఎలా తీసుకున్న భయం లేదన్న కేశినేని..అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీకి జగన్, మాకు చంద్రబాబు నాయకులు. వాళ్ళిద్దరే విరోధులు…ఇంకెవరూ విరోధులు కాదు” అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేశినేని వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

కేశినేని నేని వ్యవహారం గత కొంతకాలంగా టీడీపీకి తలనొప్పిగా మారింది. ఆయన బహిరంగంగానే పార్టీపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. అధిష్టానం వార్నింగ్ ఇచ్చిన ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల కాలంలో మరొక అడుగు ముందుకేశి..వైసీపీ నాయకులను పక్కనపెట్టుకుని టీడీపీపై మాటలదాడికి దిగుతున్నారు. మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి కనిపించిన కేశినేని నాని, తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కేశినేని తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్టిపారేస్తున్నారు. టీడీపీలో ఉండి వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా పొగుడుతారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేశినేనికి చెక్ పెట్టే విధంగా అతని సోదరుడు చిన్నికి టీడీపీ నుంచి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి తన ఉనికిని చాటుకున్నారు. ఈ సారి టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ చిన్నికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

Tags:    

Similar News