ఇటీవల ఆకాశానికి చేరుకున్న టమాటా.. ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. కిలో రూ.200 పలికిన ధర ఇప్పుడు 50 పైసలకు చేరుకుంది. మొనట్టి వరకు కిలో టమాటా ధర రూ.4 పలుకగా ఇప్పుడు మరింత పతనపై 50 పైసలకు పడిపోయింది. మంచి దిగుబడి వచ్చే సమయానికి ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం అర ఎకరా అన్న టమాటా పంట సాగు చేస్తాడు. సెప్టెంబర్ నెలలో అధిక మొత్తంలో సరుకు వస్తుండటంతో ధరపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యత ఉన్న పంటను కూడా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేందుతున్నారు. పెట్టుబడి ఖర్చు కూడా రాలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.