Kodali Nani : అది జగన్ చెప్తారు.. పకోడీగాళ్లకు ఏం సంబంధం?: కొడాలి నాని ఫైర్

Byline :  Vinitha
Update: 2024-02-20 06:02 GMT

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే అటు అధికార పార్టీ నేత జగన్ సీట్లలో మార్పులు, చేర్పులు చేస్తుడడంతో ఆ పార్టీ నేతలను కలవర పెడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగులను పార్టీ హైకమాండ్ మార్చి వారికి షాక్ ఇచ్చింది. కీలక నేతలకు కూడా సీట్లు దక్కక పోవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. ఈసారి గుడివాడ టికెట్ ను నానికి ఇవ్వడం లేదనే వార్తలు జోరుగా సాగుతోంది. ఇక ఆయన స్థానంలో మండవ హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వార్తాలపై కొడాలి నాని స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలనేది తమ అధినేత సీఎం జగన్ చెపుతార అన్నారు. అయితే మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధమని మండిపడ్డారు. వినేవాడు తెలుగు తమ్ముళ్లైతే, చెప్పేవాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా జగన్ సీటు ఇచ్చారని తెలిపారు. పైరవీలు, బ్రోకర్ పనులు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో టికెట్లు ఇవ్వరని అన్నారు. జగన్ లా చంద్రబాబు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత ఫ్లెక్సీలపై కొడాలి నాని స్పందిస్తూ...ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి, ఉదయాన్నే తీసేశాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కుట్రతోనే వల్లభనేని వంశీకి, తనకు సీట్లు లేవంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని కొడాలి నాని చెప్పారు.

Tags:    

Similar News