CM Jagan : కుప్పం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

Byline :  Vamshi
Update: 2024-02-26 08:50 GMT

కుప్పం ప్రజలకు కృష్ణా జలాలు తీసుకోస్తామని పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నేడు సీఎం కుప్పం కెనల్‌ను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో లాభలు ఉన్న పనులు మాత్రమే చేశారని ఆయన అన్నారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేయలేదని జగన్ అన్నారు. వైసీపీ అభ్యర్ధిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని సీఎం భరోసా కల్పించారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు.

672 కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు.దీంతో 6,300 ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రెండు నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్పారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికే ఉపయోగపడని చంద్రబాబు.. రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడూ విమర్శంచలేదని, మీరంతా నావాళ్లేనని గర్వంగా చెప్పుకున్నానని జగన్ తెలిపారు 




Tags:    

Similar News