'బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి.. ఉన్న ఓట్లు కూడా పోతాయ్'

ఆమెను చూస్తే జాలేస్తుంది.. కేవీపీ

Update: 2023-07-05 02:01 GMT

ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeswari ) నియమితులైన నేపథ్యంలో... రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మాత్రం ఆమె గురించి చులకనగా మాట్లాడారు. ఇక ఏపీలో బీజేపీ(BJP)కి ఉన్న 0.48 శాతం ఓట్లు కూడా ఇంకా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. దగ్గుబాటి పురందేశ్వరిని చూసి జాలి పడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన పనుల గురించి పురందేశ్వరి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసిందే బీజేపీ అని కేవీపీ(KVP) మండిపడ్డారు.




 


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu)పై కూడా విమర్శలు చేశారు. పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు వెన్నుపోటు పొడిచిన బాబు.. ఏదైనా చేయగల సమర్థుడని విమర్శించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi )తో స్టేజీ పంచుకుని, 2018లో తెలంగాణలో కలిసి పోటీ చేశారని గుర్తు చేశారు. కానీ, రాహుల్ గాంధీ లోక్‌సభ(Loksabha) సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆయన్ను ఇంటి నుంచి బయటికి పంపించి ఘోరంగా అవమానిస్తే చంద్రబాబు కనీసం నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారకపోవచ్చు.. కానీ, సంస్థాగతంగా బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.




Tags:    

Similar News