చంద్రబాబును ప్రజలు నమ్మరు : లక్ష్మీపార్వతి

Update: 2023-06-27 13:55 GMT

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తొచ్చారని తెలుగు అకాడమీ చైర్మన్, వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. ఎంత తిరిగినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎవరూ నమ్మరని తెలిపారు. తన సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడని ప్రజలపైకి వదిలారని మండిపడ్డారు. నందమూరి కుటుంబం నుంచి లాక్కొన్ని పార్టీని తిరిగి ఎన్టీఆర్ మనవళ్లు జూ.ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు అధికారంలో భారీగా దోపిడీ జరిగిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఐదు లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కనీసం కొడుకు లోకేష్‌కు కూడా సంస్కారం నేర్పలేదని విమర్శించారు. చదవు, రాయడం రాని లోకేష్‌కు గతంలో మూడు శాఖలతో మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్షేమం, అభివృద్ధి... రెండు కళ్లుగా భావించి యువనేత సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని లక్ష్మీపార్వతి కొనిడాయారు. ఏపీ విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అభినందించారు. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. విద్యార్థులకు ట్యాబ్‎లు ఇవ్వడం, విద్యాబోధనలో డిజిటలైజేషన్, ఒకటో తరగతి నుంచే పిల్లలకు అమ్మ ఒడి సహా అన్ని పథకాలు వర్తింపజేయడం, వారికి బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, స్కూళ్లలో చక్కని బెంచీలు వంటివి చూస్తే.. తనకు మళ్లీ స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలనిపిస్తోందని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

Tags:    

Similar News