విషాదం.. తిరుమలలో చిరుతదాడిలో ఆరేళ్ల పాప మృతి

Update: 2023-08-12 02:56 GMT

తిరుమలలో దారుణం జరిగింది. బిడ్డతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయలుదేరిన కుటుంబానికి చెందిన చిన్నారిపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లిపోయింది. అప్పటి వరకు కళ్ల ముందున్న చిన్నారి చిరుత దాడిలో చనిపోవడంతో పాప తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం తిరుమలకు వెళ్లింది. రాత్రి 8 గంటల సమయంలో వారంతా అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయలుదేరారు. రాత్రి 11గంటల సమయంలో వారు లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ముందు వెళ్తున్న ఆరేళ్ల వయసున్న లక్షితపై చిరుత దాడి చేసింది. తల్లిదండ్రులు కేకలు వేయడంతో అడవిలోకి ఈడ్చుకుపోయింది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. ఉదయం పాప ఆచూకీ కోసం వెతకగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసింది. విగతజీవిగా మారిన బాలికను చూసి పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News