Vizianagaram Train accident : విజయనగరం రైలు ప్రమాదం.. రద్దయిన రైళ్ల వివరాలివే

By :  Bharath
Update: 2023-10-30 03:45 GMT

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందాగా.. దాదాపు 100 మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగింది. అదే సమయంలో దాని వెనకాలే పట్టాలు మారుతున్న విశాఖ- రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దు చేయబడ్డ రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- పూరీ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.

రద్దు చేయబడ్డ రైళ్ల వివరాలు:

• ట్రైన్ నెంబర్ 12718- విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 12717- విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 17239- గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 17267- కాకినాడ-విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 17268- విశాఖపట్నం-కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 07466- రాజమండ్రి-విశాఖపట్నం మెమూ స్పెషల్‌

• ట్రైన్ నెంబర్ 07466- విశాఖపట్నం-రాజమండ్రి మెమూ స్పెషల్‌

• ట్రైన్ నెంబర్ 17243- గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 08545- కోరాపుట్‌-విశాఖపట్నం స్పెషల్‌

• ట్రైన్ నెంబర్ 08546- విశాఖపట్నం- కోరాపుట్‌ స్పెషల్‌

• ట్రైన్ నెంబర్ 22860- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- పూరీ ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 17244- రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌

• ట్రైన్ నెంబర్ 17240- విశాఖపట్నం- గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)

Tags:    

Similar News