చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

By :  Bharath
Update: 2023-09-21 08:51 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేసు ఏసీబీ కోర్ట్ లో నడుస్తుంది. పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును ఈ కేసులో ఇరికించి, జైలులో పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్.. జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు కుట్ర పన్నరని జగన్ పై ఆరోపణలు మోపారు. జైలులో అంతం చేస్తారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

‘సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత’ అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News