Nara Bhuvaneshwari : ‘సత్యమేవ జయతే’.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు..
చంద్రబాబును జైలు నుంచి విడిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాయర్లు కోర్టులో న్యాయంగా పోరాడుతుండగా.. టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం వైఖరిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు భార్య భువనేశ్వరి నిరసన దీక్ష చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత దీక్షకు కూర్చున్నారు. మరోవైపు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు దీక్ష చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ.. ఇవాళ (అక్టోబర్ 2) రాత్రి 7 గంటల నుంచి 7:05 గంటల వరకు (5 నిమిషాలు) ప్రతీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.